సర్పంచ్ ఆధ్వర్యంలో నా భూమి నా దేశం కార్యక్రమం
పొదిలి మండలం ఆముదాలపల్లి గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ చిరుమళ్ళ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు స్థానిక సచివాలయం వద్ద నా భూమి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత సంవత్సరం ప్రారంభమైన ఆజాద్ కి అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం నా భూమి నా దేశం కార్యక్రమాలను ఆగస్టు 15 వరకు కొనసాగుతాయి అని అన్నారు.
ప్రతీ గ్రామంలో అమరవీరుల పేర్లు రాసిన శిలాఫలకాల ఆవిష్కరణ, వారికి గుర్తుగా మొక్కలు నాటడం, పంచ ప్రాణ ప్రతిజ్ఞ లు చేయించడం వంటి కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు
ఈ కార్యక్రమం ప్రత్యేక అధికారి గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు