ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న హెడ్ కానిస్టేబుల్ మీరావలి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పోలీస్ స్టేషన్ నందు పనిచేసి ఇటివల హనుమంతునిపాడు పోలీసు స్టేషన్ కు బదిలీ వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ గా షేక్ మీరావలి ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు.
77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఒంగోలు పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జిల్లా ఇన్చార్జ్ మేరువ నాగార్జున చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ మరియు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు