నూతన చర్చిలను ప్రారంభించిన బాలినేని, కుందూరు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి మండలం ఓబులక్కపల్లి గ్రామం నందు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆవుల వెంకట సుబ్బారెడ్డి కుమారుడు ఎపిఆర్ గ్రూప్ చైర్మన్ ఆవుల కృష్ణ రెడ్డి సౌజన్యంతో నూతనంగా నిర్మించిన రెండు చర్చి లను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డిలు సోమవారం నాడు ప్రారంభించారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, జంకె వెంకటరెడ్డి, మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి వైసిపి నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, కశిరెడ్డి వెంకట రమణ రెడ్డి,లు మాట్లాడుతూ తాము ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత జన్మభూమి లో అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పనా, వైద్యసేవలు అందిస్తున్నా ఎపిఆర్ గ్రూప్ డైరెక్టర్లు ఆవుల కృష్ణ రెడ్డి, జయరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సంజీవరెడ్డి ప్రవీణ్ రెడ్డి లను అభినందించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు