విద్యార్థులకు యూనిఫాం ను పంపిణీ చేసిన పూర్వ విద్యార్ధులు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పూర్వ విద్యార్ధులు యూనిఫాం ను పంపిణీ చేశారు.
సోమవారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపాల్ తారా వాణి అధ్యక్షతనతో జరిగిన కార్యక్రమంలో 1992-93 పూర్వ విద్యార్ధులు మూల్లా హాసన్ వలి బడే అన్నపురెడ్డి మాధవ్ రెడ్డి సౌజన్యంతో 20 విద్యార్థులకు యూనిఫాం కుట్టు కూలిని అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హబిబూల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బెగ్ పూర్వ విద్యార్ధులు అంజిరెడ్డి, షేక్ ఖాదర్ భాషా, షేక్ బాజీ మరియు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు