పొదిలి పట్టణం బాప్టిస్ట్ పాలెం వద్ద మంచినీటి సరఫరా కై మహిళలు రాస్తారోకో

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి పట్టణం బాప్టిస్ట్ పాలెం సమీపంలోని ఒంగోలు -కర్నూలు జాతీయ రహదారిపై మంచినీటి సరఫరా చెయ్యాలని కోరుతూ మహిళలు రాస్తారోకో నిర్వహించారు.

గత 20 రోజులుగా మంచినీటి సరఫరా చేయకపోవడంతో ఆగ్రహించిన మహిళలు రోడ్డు అడ్డంగా టైర్లు వేసి ఖాలీ బిందెల తో ఆందోళన చేసారు.

ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఎంఎల్ఏ కుందూరు నాగార్జున రెడ్డి వచ్చి సమస్య పరిష్కారం చేసే వరకు రాస్తారోకో విరమించేది లేదని అన్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళలను నచ్చజెప్పి ఆందోళన విరమించలేదు

మున్సిపల్ అధికారులు వచ్చి ఆందోళన చేస్తున్న మహిళలకు నచ్చజెప్పి మంచినీటి సరఫరాకు హామీ ఇచ్చి రాస్తారోకో ను విరమింపజేసారు.

అనంతరం కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్ధీకరణ చేసారు.