వైభవంగా సమంతపూడి జన్మదిన వేడుకలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ జిల్లా నాయకులు శివాలయం దేవస్థానం మాజీ ఛైర్మన్ సమంతపూడి నాగేశ్వరరావు మనువడు వర్ధన్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి
బుధవారం నాడు స్థానిక దరిశి రోడ్ లోని మంజునాథ కళ్యాణ మంటపం నందు సమంతపూడి నాగేశ్వరరావు మనువడు వర్ధన్ జన్మదిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సమక్షంలో కేక్ ను కోసి బంధువులకు పంచిపెట్టారు.
అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బంధువులు స్నేహితులు అనుచరులు కు విందు భోజనం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు