చంద్రబాబు కేసుల నుంచి సురక్షితంగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేసుల నుంచి సురక్షితంగా బయటకు రావాలని కోరుతూ కొనకనమిట్ల మండలం పెద్ద అరికట్ల, సిద్దవరం, గొట్లగట్టు ఎదుర్లపాడు,అంబపురం, తువ్వపాడు, తోపాటు పలు గ్రామాల్లోని దేవాలయాలు చర్చిలు ల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు
పొదిలి పట్టణం విశ్వనాథపురం లోని రామయలం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ కార్యక్రమాల్లో తెలుగు దేశం పార్టీ నాయకులు చప్పిడి రామ లింగయ్య, గొట్లగట్టు సర్పంచ్ పెరికె సుకదేవ్, పరిటాల సుబ్బయ్య,వేముల శ్రీనివాస్, పేరయ్య, రోసయ్య,లడ్డు, పొదిలి పట్టణ నాయకులు మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖుద్దుస్ తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు