అర్జీదారులలో సంతృప్తి స్థాయి పెరిగేలా స్పందన దరఖాస్తులు పరిష్కారించాలి – జిల్లా కలెక్టర్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
అర్జీదారులలో సంతృప్తి స్థాయి పెరిగేలా స్పందన పిటిషన్లను పరిష్కరించాలని జిల్లా కలెక్ట శ్రీ ఏ.ఎస్. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అర్జీల పరిష్కారంలో జవాబుదారీతనం పెంచడాని మండల స్థాయిలో “జగనన్నకు చెబుదాం” (స్పందన) కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం పొదిలి మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం స్థానిక సాయ బాలాజీ కళ్యాణ మండపంలో జరిగింది. కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీ కె. శ్రీనివాసులు ట్రైనీ కలెక్టర్ శౌర్య మన్ పటేల్, ఆర్.డి.ఓ. శ్రీ అజయ్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో 154 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమని చెప్పారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా అర్జీదారులు సంతృప్తి పరిష్కరించాలని ఆయన పునరుద్ఘాటించారు. అర్జీలను సకాలంలో పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలని ఆయన స్పష్టం చేశారు. కింది స్థాయి అధికారులు అర్జీలను పరిష్కరిస్తున్న తీరును ఆయా శాఖలలోని స్పందన నోడల్ అధికారులు పర్యవేక్షించి సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు అశోక్ కుమార్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్, మరియు జిల్లా,మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు