జగనన్న సురక్ష కు విశేష స్పందన
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని ఒకటవ సచివాలయం నందు బుధవారం నాడు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జిల్లా వైద్య అధికారిణి రాజ్యలక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు
జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నందు ప్రజలందరికీ ఆధునిక ఉచిత వైద్యసేవలు మరియు సమగ్ర కంటి వైద్యసేవలు అందిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రాజ్యలక్ష్మి తెలిపారు.
వైద్య శిబిరం నందు ప్రజలందరికీ రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి అనంతరం వైద్య సేవలు అందిస్తున్నామని మొత్తం 194 రకాలు మందులు అందుబాటులో ఉన్నాయని శిబిరంలో 44 పరీక్షలు చేస్తున్నామని అదే విధంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు, మందులు, శుక్లాములను ఉచితంగా శాస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో పొదిలి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ , ప్రభుత్వం వైద్యులు డాక్టర్ బాలయ్య, డాక్టర్ సుజన్, పూజిత, నర్మద,సుభాన్ ఖాన్,మున్సిపల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి రావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు