విశ్రాంత కలెక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో ఐక్యతా విజయపథం పాదయాత్ర
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పేదరికం నుంచి పేద జన విముక్తే ధ్యేయం ఐకమత్యమే లక్ష్యంగా మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి విజయ్ కుమార్ తలపెట్టిన ఐక్యతా విజయపథం పాదయాత్ర 59వ రోజు పొదిలి మండలంలోకి ప్రవేశించింది.
గురువారం నాడు స్థానిక పొదిలి మండలం ఉప్పలపాడు , గోగినేని వారి పాలెం, పిర్థోస్ నగర్, తలమల్ల, గ్రామాల్లో బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలతో మమేకమై వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు
ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు