నారా చంద్రబాబు నాయుడు గారిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స అందించాలి: షేక్ రసూల్ మహమ్మద్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
అధ్యక్షులు ప్రకాశం జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ తెలుగుదేశం పార్టీ
ప్రజ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు 35 రోజులు జైలుకే పరిమితం చేసిన జగన్ రెడ్డి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బంది పాలు చేయడం దుర్మార్గం చర్య, క్రమశిక్షణతో కూడిన ఆహారాలు అలవాట్లు కలిగిన చంద్రబాబు గారిని అనారోగ్యం పాలు చేసి ప్రజాశక్తిలో రానీకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పడుతున్నారు అని రసూల్ అన్నారు.
నారా చంద్రబాబునాయుడు గారు దీర్ఘకాలికంగా చర్మవ్యాధితో బాధపడుతున్న విషయం అందరికి తెలిసిందే వారికి కేవలం జైల్లో వేడినీళ్లు కూడా అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం సైకో ఆనందం పొందుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజాధనం తో బతుకుతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అవాకులు చవాకులు మాట్లాడడం మంచిది కాదని వారి డైరెక్షన్లోనే జైల్లో సూపర్డెంట్ గారు ఉండడం సరైన పద్ధతి కాదని అన్నారు.
ప్రజా నాయకుడు నీ వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స అందిస్తూ వారికి ఎటువంటి హాని లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత జైలు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని అన్నారు
ఈ సమావేశంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు కాటూరి వెంకటనారాయణ బాబు జిల్లా కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, జిల్లా వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షులు సామంతపూడి నాగేశ్వరావు, జిల్లా ముస్లిం మైనారిటీ అధికార ప్రతినిధి షేక్ యాసిన్, ఎస్సీ సెల్ నాయకులు ఆరిక రాము, మండల ఐటీడీపీ కోఆర్డినేటర్ ముని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు