ఇక వైసీపీ పార్టీ కి చుక్కలే -కందుల
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇంకా చుక్కలు చూపిస్తామని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు
మంగళవారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని ఒక ప్రైవేటు సంస్థ నందు ఏర్పాటు చేసిన పొదిలి పట్టణం, పొదిలి మండలం కొనకనమిట్ల మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ప్రతి తెలుగుదేశం నాయకుడు కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని ఓటర్ వెరిఫికేషన్లో ప్రతి నాయకుడు అప్రమత్తంగా ఉండాలని రాబోయే నాలుగు నెలలు అత్యంత కీలకమని ప్రతి ఒక్కరు కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కార్యకర్తలతో పని చేయించడంకు ఓటర్ వెరిఫికేషన్ కమిటి, ప్రోగ్రాం కమిటీ మరియు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ఈ నాలుగు నెలలు అత్యంత అప్రమత్తతో పనిచేయాలని కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పై విడుదల సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు అనంతరం కార్యకర్తలు బాణాసంచా పేల్చి తమ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ తెలుగు దేశం పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ రసూల్ తెలుగు దేశం పార్టీ జిల్లా కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు, మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్, టి యన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యదర్శి పండు అనీల్ పొదిలి మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దుస్, కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్, కొనకనమిట్ల మండల మాజీ అధ్యక్షులు కనకం నరసింహారావు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చప్పిడి రామ లింగయ్య, మాజీ అధ్యక్షులు తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మరియు రెండు మండలాలకు చెందిన తెలుగు దేశం పార్టీ నాయకులు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు