ఎంపీ మాగుంట ఎంఎల్ఏ కుందూరు కు ఘన స్వాగతం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
నూతన భవనాన్ని ప్రారంభించిన మాగుంట
కొనకనమిట్ల మండలం చిన్నరికట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి లాంఛనంగా ప్రారంభించగా సచివాలయంలోని ఇతర బ్లాక్ లను డాక్టర్ ఉడుముల అశోక్ రెడ్డి, గ్రామ పంచాయతీ సర్పంచ్ చేత ప్రారంభించారు
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి లకు ఉడుముల యూత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
స్థానిక చిన్నరికట్ల జంక్షన్ నుంచి చిన్న అరికట్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అడుగు అడుగున ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎంఎల్ఏ కుందూరు నాగార్జున రెడ్డి , మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి లకు హారతి లు పడుతూ ఘన స్వాగతం పలికారు
అనంతరం నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించి గడప గడపకు మన ప్రభుత్వం భాగంలో చిన్న అరికట్ల గ్రామంలో పర్యటించారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు అక్కిదసరి ఏడుకొండలు, మండల పరిషత్ అధ్యక్షులు మూరబోయిన మురళి కృష్ణ యాదవ్, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు ఉడుముల రామనారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ ఉడుముల గురవరెడ్డి స్థానిక గ్రామానికి ప్రజా ప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు