డిపో మేనేజర్ వైఖరి నిరసిస్తూ ఉద్యోగులు నిరసన
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ పొదిలి డిపో మేనేజర్ సుందరరావు కు బస్సుల కండిషన్ ,కలెక్షన్ ,ఆయిల్ గురించి అవగాహన లేకుండా డిపోలో ఉన్న సర్వీసులన్నీ రోజుకు ఒక రకంగా మారుస్తూ ప్రయాణికులకు ఏ రోజు ఏ సర్వీసు ఏ టైముకు వస్తుందో తెలియకుండా నష్టాల బాటలో సంస్థ రావటానికి కారణం అవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు.
యూనియన్ నాయకులు ప్రశ్నించినప్పుడు లెక్కచేయకుండా మాట్లాడుతున్నారు అందువలన సంస్థ నష్టాల బాటలో నడుస్తున్న విషయం పై తక్షణమే ఉన్నత అధికారులు వెంటనే చొరవ తీసుకొని డిపో మేనేజర్ విధానాలకు స్వస్తి పలికే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ యస్ డబ్ల్యూ ఎఫ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.