వక్ఫ్ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి – ముల్లా ఖాదర్ భాషా డిమాండ్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణం రైల్వే బ్రిడ్జి సమీపంలోని కోట్లాది రూపాయల విలువచేసే చిన్న మసీదు పెద్ద మసీదు మన్యం భూమిలో ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పొదిలి గ్రామ పంచాయతీ మాజీ పాలకవర్గ సభ్యులు ముల్లా ఖాదర్ భాషా ప్రభుత్వం డిమాండ్ చేశారు
ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్న అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు జరిగిన ఆక్రమణలు వెనుక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెందిన ఒక నాయకుడు ఉన్నట్లు ముల్లా ఖాదర్ భాషా సంచలన ఆరోపణలు చేశారు
తక్షణమే అధికారులు స్పందించి వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు