పొదిలి మండలం 1000 హెక్టార్లు పంట నష్టం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండలంలో మిచాంగ్ తూఫాన్ ప్రభావంతో వరి, మిర్చి,పొగాకు, మినుములు, శెనగలు పంటలు దెబ్బతిన్నాయి.
గత మూడు రోజులుగా మిచాంగ్ తూఫాన్ ప్రభావంతో మండలంలో పలు రైతు బరోసా కేంద్రాల పరిధిలో మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులాబ్దిన్ విస్తృతంగా పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసారు.
పొదిలి మండలం పరిధిలో వెల్లూరు, సల్లూరు, ఉప్పలపాడు, రెవెన్యూ గ్రామల పరిధిలో వరి పంట 207 హెక్టార్లు పంట నష్టం వాటిల్లిగా మండలం పరిధిలో 452 హెక్టార్లు మిర్చి పంట నష్టం వాటిల్లిందని అదే విధంగా పొగాకు మినుములు శెనగలు పంటలు 150 హెక్టార్లు మొత్తం మీద 1000 వెయ్యి హెక్టార్లు పంట నష్టం వాటిల్లిందని సంబంధించిన పూర్తి వివరాలు నివేదిక జిల్లా ఉన్నతాధికారులకు పంపినట్లు మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులాబ్దిన్ తెలిపారు
మిర్చి పంట నష్టపోయిన రైతులు మాట్లాడుతూ తాము మిర్చి పంటకు ఎకరం కు లక్షన్నర పెట్టుబడి పెట్టమని తూఫాన్ ప్రభావంతో మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నది కావున తమకు ప్రభుత్వం నష్టపరిహారం అదించి న్యాయం చేయాలని కోరారు