399 రూపాయలకే 10 లక్షల ప్రమాద భీమా

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఆధ్వర్యంలో 399 రూపాయలకే 10 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తుందని తంతి తపాలా శాఖ డివిజనల్ సూపర్ డెంట్ శ్రీనివాస్ అన్నారు.

శనివారం నాడు స్ధానిక పొదిలి హెడ్ పోస్టాఫీసు నందు మేనేజర్ నాగేశ్వరరావు అధ్యక్షతన తో ప్రమాద భీమా ప్రత్యేక కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఇటివల ప్రమాదవశాత్తు మరణించిన పొదిలి మండలం ఈగలపాడు గ్రామానికి కోటి రెడ్డి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రమాద భీమా చెక్కు ను శనివారం నాడు డివిజన్ సూపర్ డెంట్ శ్రీనివాస్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఐపి విజయ్ కుమార్, పొదిలి హెడ్ పోస్టాఫీసు మేనేజర్ నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, టాటా కంపెనీ చెందిన ఆనంద్ మరియు తంతి తపాలా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు