తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ కార్యకర్తలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది.

నాలుగో రోజు స్ధానిక విశ్వనాథపురం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్, పెద్ద బస్టాండు మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు అంగన్వాడీ మేలు బారి ర్యాలీ నిర్వహించారు.

అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నినాదాలు చేసారు

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు న్యాయమైన డిమాండ్ల పరిష్కారించాలని నిన్ను‌ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులకొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సమ్మెను అణిచివేసేందుకు కుయుక్తులు పన్నుతుందని గతంలో ఇల చేసిన చంద్రబాబుకు ఎ గతి పట్టిందో జగన్మోహన్ రెడ్డికు అదే గతి పడుతుందని హెచ్చరించారు.

అనంతరం తహశీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం రమేష్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు శోభా పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు