రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో పొదిలి యువకుడు ప్రతిభ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ మరియు కర్నూలు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 24వ తేదీన కర్నూలు లో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో పొదిలి మండలం గోగినేని వారి పాలెం చెందిన గోపనబోయిన శ్రీనివాస్ ప్రతిభ చూపించారు.
మొత్తం ఐదు విభాగాలకు జరిగిన పోటీల్లో పాల్గొన్న గోపనబోయిన శ్రీనివాస్ రెండు స్వర్ణ పతకాలు రెండు వెండి పతకాలు ఒక కాంస్య పతకాన్ని సాధించారు.
రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్,నగర మేయర్ రామయ్య చేతుల మీదుగా పతకాలను అందుకుంటున్నారు.
రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా త్వరలో శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు