7న మానవత ఆత్మీయ సమావేశం జయప్రదం చేయండి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

మానవత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జనవరి 7వ తేదీ ఆదివారం నాడు దర్శి రోడ్ లోని యస్వీ గార్డెన్ లో మానవత ఆత్మీయ సమావేశం జరుగుతుందని సంస్థ నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి, యలమంద రెడ్డి, జి శ్రీనివాసులు, మువ్వల పార్థసారథి,బండి అశోక్, షేక్ రోటీ యస్దాన్, నారాయణ రెడ్డి లు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరుగుతుందని ఈ కార్యక్రమంలో స్త్రీలకు ఆటపోటిలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేస్తునట్లు తెలిపారు