ఆధార్ తప్పనిసరి యస్ఐ వెంకట సైదులు సూచన
లాడ్జ్ లో రూములు కోసం వచ్చే వారి నుండి ఆధార్ తప్పనిసరి తీసుకోవాలని పొదిలి యస్ఐ వెంకట సైదులు అన్నారు.
శనివారం నాడు స్ధానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు పట్టణంలోని లాడ్జ్ యాజమానులు తో యస్ఐ వెంకట సైదులు సమావేశం నిర్వహించి లాడ్జ్ లో ఖచ్చితంగా రిజిస్టర్లు నమోదు చేయాలని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు, మద్యపానం సేవించడం లాంటివి ప్రోత్సహించినట్లతే కఠిన చర్యలు తీసుకుంటామని యస్ఐ వెంకట సైదులు సూచించారు