క్రికెట్ టోర్నమెంట్ ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు మరియు ముగ్గుల పోటీల విజేతలకు పొదిలి యస్ఐ వెంకట సైదులు, తహశీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు.
ప్రధమ బహుమతి సూర్య లెవెన్స్ ద్వితీయ బహుమతి చంద్ర పై రైట్స్, తృతీయ బహుమతి యస్ యస్ లెవెన్స్ సాధించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ పోటీలు, ముగ్గులు పోటీలు రక్తదానం శిబిరం ఏర్పాటు చెయ్యడం అభినందనీయమని అన్నారు
అనంతరం రాజన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బీరం రాజమోహన్ రెడ్డి రీజ్వనా దంపతులను ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల అధ్యాపకులు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు