పొదిలి పోలీసు స్టేషన్ లో పనిచేసిన ముగ్గురు సిఐ లుగా పదోన్నతి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి పోలీసు స్టేషన్ లో యస్ఐలుగా పనిచేసిన ముగ్గురు సిఐ లుగా పదోన్నతి పొందారు.

పొదిలి పోలీసు స్టేషన్ నందు 2017 -18 సంవత్సరాల్లో పొదిలి యస్ఐ గా పని చేసిన సూరేపల్లి సుబ్బారావు, 2019-21 వరకు పనిచేసిన సురేష్ 2021-22 వరకు పని చేసిన వై శ్రీహరి‌
లకు 2024 జనవరి 24వ తేదీన సిఐ లుగా పదోన్నతి పొందినట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్.ఐలుగా విధులు నిర్వహిస్తూ సి.ఐలుగా పదోన్నతి పొందిన వారు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐపీఎస్ గారిని ఐదుగురు ఎస్సైలు ఏ.సుబ్బరాజు (కొమరోలు పిఎస్) వై. శ్రీహరి (పుల్లెల చెరువు పిఎస్) డి. ప్రసాద్ (విఆర్, ఒంగోలు), కె.సురేష్ (పామూరు పిఎస్) ఎస్.సుబ్బారావు (విఆర్ ఒంగోలు) పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు