ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న యస్ ఆర్ జిలానీ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ప్రకాశం జిల్లా ఉత్తమ ప్రతిభా పురస్కారాన్ని పొదిలి పట్టణానికి చెందిన షేక్ రాయపాటి జిలానీ అందుకున్నారు.

వివరాల్లోకి వెళితే గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బంగోలు పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కార సభలో రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టు నందు జిల్లా ఉత్తమ   పురస్కారాన్ని  పొదిలి rws కార్యాలయం నందు పనిచేస్తున్న షేక్ రాయపాటి జిలానీ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు యస్పీ మలిక గార్గ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.