పొదిలి లోని చెవిరెడ్డి క్యాంపు కార్యాలయంలో బొట్ల
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణం బి ఎల్ ఎన్ గ్రాండ్ లోని చెవిరెడ్డి క్యాంపు ఆఫీసు నందు ఒంగోలు పార్లమెంటు డిప్యూటీ రీజనల్ కో-ఆర్డినేటర్ మరియు సంతనూతలపాడు శాసనసభ్యులు టి జే అర్ సుధాకర్ బాబు ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసి విభాగం జోన్ -5 ఇన్ఛార్జ్ బొట్లా రామారావు, బిసి ఉద్యోగుల సంఘం నాయకులు కొనికి వెంకట్రావు, బిసి నాయకులు చెన్నుబోయిన మస్తాన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ లో ఎంపీ అభర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి మరియు పార్లమెంట్ పరిధి లోని ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం కొరకు ప్రణాళిక రూపొందించి తగు విధానాలు, కార్యక్రమాలు గురించి చర్చించారు.