ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా -పొదిలి పట్టణం
పొదిలి డిపో పరిధిలోని అధికారులు సూపర్వైజర్లు ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రెండోరోజు నిరసన తెలిపారు
దివాకర్ అధ్యక్షతన జరిగిన గెట్ మీటింగ్ లో రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు కొండలరావు మాట్లాడుతూ డిపో లో నెలకొన్న సమస్యలను త్వరగతిన పరిష్కారం చూపాలని ,డిపో అసిస్టెంట్ సెక్రటరీ ఎస్కే కే భాష డ్యూటీ చార్ట్లు త్వరగా వేయవలెను మరియు కార్మికుల వార్షిక ఇంక్రిమెంట్లను యూనియన్లకు అతీతంగా సకాలంలో కల్పవలెను అని ఓడి లను సీనియార్టీ ప్రాతిపదికనా నియమించవలసిందని ఎక్సెస్ స్టాప్ పే పేరునరూన వేరే డిపోలలో పనిచేయుచున్న కార్మికులను మాతృ డిపోలకు రప్పించవలెనని మరియు ఎస్ఆర్ కట్టలను దొంగలించిన దొంగలను త్వరతాగతిన పట్టుకొని చర్యలు తీసుకోవాలని ప్రసంగించినారు.
డిపో ప్రెసిడెంట్ ఎం డి ఏ బాజీ మాట్లాడుతూ డిపో లోని గ్యారేజ్ నందు నీటి వసతి కల్పించవలసిందిగా మరియు యూనియన్ అతీతముగా లీవ్ పొజిషన్ కల్పించవలసిందిగా కోరినారు కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని అన్నారు .
డిపో సెక్రెటరీ పి ఓబులేసు మాట్లాడుతూ డిఎం ఆఫీస్ నందు మరియు గ్యారేజ్ నందు బాత్రూం రిపేరు చేయవలసిందిగా గ్యారేజ్ నందు ముఖముఖాలు చూడకుండా యూనియన్లకు అతీతంగా బస్సులు ఇవ్వవలసిందిగా మరియు ఏడీసీలను సప్లింగే ప్రకారం వారి విధులను నిర్వహించవలసిందిగా కోరారు .
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు మరియు ఉద్యోగులు గ్యారేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు