హెడ్ కానిస్టేబుల్ నాగూర్ మీరావలికి ఘనంగా వీడ్కోలు
పదవి విరమణ పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ సేవలను ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి అభినందించారు
పోలీసు శాఖలో చేరి గత 37 సంవత్సరాల కాలం పోలీసు శాఖ లో విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ విధులులో నిర్వహిస్తున్న షేక్ నాగూర్ మీరావలి (HC -619) ఆదివారం నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగికి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని, విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో కుటుంబానికి దూరంగా ఉండి విధులు నిర్వహించారన్నారు.
పోలీస్ ఉద్యోగ నిర్వహణలో ఎంతో నిబద్దత, అంకితభావంతో జిల్లా పోలీస్ శాఖకు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచి సేవ పతకం, ఉత్తమ సేవ పతకం మరియు క్యాష్ రివార్డ్ లు అందుకోవటం అభినందనీయమన్నారు.
వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఇకపై కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు. సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో సేవలు అందించుటకు సహాయ సహకారాలు అందించిన వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో వారికి ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామి రెడ్డి, ఏఆర్ ఎస్ఐ తిరుపతి స్వామి, సిబ్బంది మరియు హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.