మార్కాపురం నియోజకవర్గం లో 3 నామినేషన్లు తిరస్కరణ 29 అమోదం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
సార్వత్రిక ఎన్నికలు నామినేషన్ల పరిశీలనలో భాగంగా శుక్రవారం నాడు మార్కాపురం ఆర్డీవో కార్యాలయం నందు సబ్ కలెక్టర్ రాహుల్ మీనాన్ ఆధ్వర్యంలో నామినేషన్లు పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మొత్తం 32 నామినేషన్లు ల్లో వైసిపి డమ్మి అభ్యర్థి అన్నా రాంబాబు భార్య అన్నా దుర్గా కుమారి, తెలుగు దేశం పార్టీ డమ్మి అభ్యర్థి నారాయణరెడ్డి, కాంగ్రెసు పార్టీ అభ్యర్థి షేక్ సైదా లకు చెందిన ముగ్గురు నామినేషన్లు తిరస్కరించి 29 మంది నామినేషన్లు ఆమోదం తెలిపారు.
నామినేషన్లు ఆమోదం పొందిన వారి వివరాలు
గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు, తెలుగు దేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ జావేద్ అన్వర్,
రిజిస్టర్ రాజకీయ పార్టీల అభ్యర్థులు
జై భీమ్రావు భారత్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి నారాయణ రెడ్డి ,నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం నారాయణరెడ్డి విసీకే పార్టీ అభ్యర్థి నూతల పార్టీ రాజు భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి రావెళ్ల భాగ్యలక్ష్మి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి సయ్యద్
స్వతంత్ర అభ్యర్థులు
అబ్దుల్ రఫీ కంది నారాయణరెడ్డి కనుబుద్ది రామ్ గోపాల్ రెడ్డి కూకట్పల్లి అప్పన్న కొత్త పులి బ్రహ్మారెడ్డి గాయం వెంకట్ రెడ్డి తవణం మహేశ్వర్ రెడ్డి తిరుమల శెట్టి సుబ్బలక్ష్మి దేవి రెడ్డి హనుమారెడ్డి దొండపాటి శ్రీనివాసరెడ్డి ఏరువా నాగార్జున్ రెడ్డి పఠాన్ సుభాని పొట్టి వెంకట సుబ్బారావు పొట్లూరు ఇమ్మానియేల్ వరకే బాలయ్య భవనం వెంకటేశ్వర్ రెడ్డి పావులూరి భాను ప్రసాద్ యిర్రి బాల మద్దిలేటి యుద్ధం నరసింహారావు వారి నామినేషన్లు ఆమోదం పొందినట్లు ఎన్నికల రకంగా అధికారి రాహుల్ మీనాన్ ప్రకటన విడుదల చేశారు