ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలలో పొదిలి శ్రీ వివేకానంద విజయకేతనం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం నాడు ప్రకటించిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం బెటర్ మెంట్ పరీక్షా ఫలితాలలో 464(ఎంపీసీ) షేక్ రబ్బానీ ముస్కాన్ రాష్ట్ర స్థాయి లో రెండవ ర్యాంక్ ను పొదిలి పట్టణ స్థాయి లో ప్రథమ స్థానం సాధించింది.
ఎంపీసీ గ్రూప్ లో ఎన్ పూజిత (463), కే సాయి కృష్ణారెడ్డి(462)షేక్ మిస్బా హురైరా(459) సాధించారు.
బైపైసీ ప్రథమ సంవత్సరం లో ఆర్ మధురాగిణి (434), జి మనస్విని (428), కే ఆదిలక్ష్మి (428),షేక్ సైనూర్ మిష్రీన్ (427) సాధించారు.
సీఈసీ లో ఏమ్ కావ్య (449), పి అరవింద (446) సాధించారు.
అత్యధిక మార్కులు సాధించి పొదిలి శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్ధులను కళాశాల డైరెక్టర్ వై వెంకటేశ్వరరావు,ప్రిన్సిపాల్ ఎం కృష్ణ కుమార్,డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భవనం శ్రీనివాసరెడ్డి,అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తదితరులు అభినందించారు