చెస్ పోటీలలో పొదిలి విద్యార్థులకు బంగారు పతకాలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి బేసిక్ చెస్ అకాడమీకి చెందిన సామి నిహాల్ సువిత్(6వ తరగతి), సామి విహాల్ సువిత్(4వ తరగతి)
విద్యార్థులకు దర్శిలో జరిగిన ఏపీ చెస్ అకాడమీ ఒంగోలు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ పోటీలలో అన్నదమ్ములు ఇద్దరికీ బంగారు పతకాలు సాధించారు.
బహుమతులను దరిశి భాష్యం విద్యా సంస్థ ప్రిన్సిపాల్ జగదీష్ చేతులు మీదుగా సర్టిఫికెట్లు బంగారు పతకాలు, జ్ఞాపికలు అందుకున్నారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు రవి కిషోర్ తమ పిల్లలు చెస్ పోటీల్లో బంగారు పతకాలు సాధించటంతో హర్షం వ్యక్తం చేశారు