9వ రోజుకు చేరిన ఆర్టీసీ ఉద్యోగుల రిలే దీక్షలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి డిపోలో యాజమాన్యం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఏపీ పి టి డి ఎంప్లాయిస్ యూనియన్ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరాయి.

తొమ్మిదవ రోజు దీక్ష లో యు ఎన్ రావు,ఎం జె జిలానీ,ఐ యస్ రావు,గంగయ్య లకు జోనల్ నాయకులు యస్ వి యన్ శాస్తి, తిరుపతయ్య, షేక్ జాఫర్, సుందరం పూల మాలలు వేసి దీక్షకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర, జోనల్ నాయకులు మాట్లాడుతూ డిపోలో మూడు సంవత్సరాల నుంచి చార్ట్లు వేయకుండా అధికారులు కండక్టర్లను డ్రైవర్లను ఇబ్బందులను గురిచేస్తూ అశాంతి వాతావరణానికి కారణం అవుతున్నారని ఎక్సెస్ పేరుపై కనిగిరి డిపోకు రిలీవింగ్ పై పంపినటువంటి డ్రైవర్లను వెంటనే మాతృ డిపో కి తెప్పించి లీవ్ పొజిషన్ కల్పించాలని కోరారు.

సకాలంలో ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లు కలిపేలా చర్యలు తీసుకోవాలని డిస్పాచ్ మెకానిక్ కృష్ణ డ్రైవర్లపై పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకొని వెంటనే డిస్ప్యాచ్ మెకానిక్ ను వెంటనే మార్చాలని అహర్నిషలు శ్రమ పడుతూ సంస్థకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్న ఉద్యోగులను నిబంధనకు విరుద్ధంగా చిన్న చిన్న పొరపాటులకు 1/ 2019 సర్కులర్ ను అమలు చేయకుండా డిఎం గారి ఇష్ట ప్రకారము పనిష్మెంట్ ఇస్తు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తూ ఆర్థిక నష్టం కల్పిస్తున్నారు.

కానీ అక్రమ మాస్టర్లు ఇచ్చి సంస్థ కు ఆర్థిక నష్టం కల్పిస్తున్న ఎస్ టి ఐ గారి పై ఎటువంటి చర్యలు లేవని ఏ యం టి కార్యాలయంనందు హెయిర్ బస్ లకు సంబంధించిన ఎస్సార్లు పోతే ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు పై విషయాలపై ఆర్ ఎం గారి దృష్టికి తీసుకెళ్లిన సూపర్వైజర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మా సమస్యలు పరిష్కరించేంతవరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని వారు అన్నారు