పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండలంలోని రైతులు తమ పంటలను సెప్టెంబర్ 15 వ తేదీ లోపల ఈ-పంట నమోదు చేసుకోవాలని పొదిలి మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులబ్దన్ ఒక ప్రకటనలో తెలిపారు
పొదిలి మండల పరిధిలోని 32 రెవెన్యూ గ్రామాల్లో 25713 ఎకరాల వ్యవసాయ భూమి లో వ్యవసాయ పంటలు మరియు ఉద్యాన పంటలు సాగు చేయటం జరుగుతుందని ఇందులో ఖరిఫ్ సీజన్లో కంది పంట 20 వేల ఎకరాలు 997 ఎకరాల్లో సజ్జా 342 ఎకరాలు వరి 760 మిర్చి సాగు చేయటం జరుగుతుందని కావున ప్రతి ఒక్క రైతు ఈ- పంట చేయించుకోవడం వల్ల ప్రభుత్వం సబ్సిడీ, పంట బీమా, విత్తనాలు పొందుటకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు