న్యాయవాదుల సవరణ బిల్లుకు వ్యతిరేకిస్తూ విధులు బహిష్కరించిన న్యాయవాదులు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తలపెట్టిన న్యాయవాదుల చట్టం-2023 సవరణ బిల్లులకు వ్యతిరేకంగా పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పని చేస్తున్న న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వి. రమణ కిషోర్ కార్యదర్శి షేక్ షబ్బీర్ ఉపాధ్యక్షులు సుజాత సంయుక్త కార్యదర్శి గాలి ముట్టి పెద్దయ్య న్యాయవాదులు రామ్మోహన్ రావు బి వెంకటేశ్వర్లు గంగవరపు శ్రీనివాసులు యశ్వంత్ జిలాని చినబాబు తదితరులు పాల్గొన్నారు