చందవరం బౌద్ధా రామం ను పర్యటన కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రకాశం జిల్లా బుద్ధిష్ట్ సోసైటి ఆధ్వర్యంలో శనివారం నాడు దొనకొండ మండలంలోని చందవరం బౌద్ధారామన్ని ప్రతినిధి బృందం సందర్శించారు.
ఈ సందర్భంగా బౌద్ధారామం పై ఉన్న చిత్రల విశిష్టత గురించి బౌద్ధ సన్యాసులు డాక్టర్ అయపాల భరద్వాజ లు ప్రతినిధి బృందానికి వివరించారు.
2 వేల సంవత్సరాల క్రితం నాటి అరుదైన చారిత్రాత్మకమైన బౌద్ధరామం న్ని ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే పెద్ద ఎత్తున దేశ విదేశాల్లో నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది వారు అన్నారు
ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ బుద్ధిష్ట్ సోసైటి సభ్యులు చిరంజీవి, రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు