మాజీ సిఎం జగన్ తో భేటీ అయిన కొనకనమిట్ల నేతలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని తాడేపల్లి లోని నివాసంలో కొనకనమిట్ల మండల నేతలు కలిశారు.

కొనకనమిట్ల మండల పరిషత్ ఛైర్మన్ మూరబోయిన మురళి కృష్ణ యాదవ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు మోరా శంకర్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరి సంజీవరెడ్డి, మండల నాయకులు రాజశేఖర్ యాదవ్ మరియు సర్పంచ్లు ముఖ్య నాయకులు తో కుడిన బృందం నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు సారథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అంశాలను మాజీ సిఎం జగన్ దృష్టికి తీసుకొని వెళ్ళి గా ఆయన స్పందిస్తూ త్వరలోనే ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష ఆందోళనకు కార్యక్రమాలకు పార్టీ క్యాడర్ సమాయత్తం కావాలని తెలిపినట్లు వారు తెలిపారు