గాండ్ల అన్నదాన సత్రం నూతన కమిటీ ప్రమాణం స్వీకారం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

అఖిల భారత గాండ్ల అన్నదాన సత్రం సర్వసభ్య సమావేశం ఆదివారం నాడు స్థానిక వెలిగొండ నందు ఎన్నికల అధికారులు తంగేళ్ల నాగు భూషణం,చిట్టింశెట్టి వెంకట సుబ్బారావు, వరికుంట్ల వెంకటేశ్వర్లు, భీమవరపు పిచ్చయ్య ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అఖిల భారత గాండ్ల అన్నదాన సత్రం నూతన కమిటీ

గౌరవ అధ్యక్షులుగా – బట్టు రామారావు, బట్టు మహానంది, బల్లవరపు వెంకటేశ్వర్లు, అధ్యక్షులుగా అళ్లచెరువు శ్రీరాములు, కార్యనిర్వహక అధ్యక్షులు ముద్దపాటి కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి యేరువ కృష్ణారావు, కోశాధికారిగా అళ్లచెరువు మోహన్ రావు, మహిళా కార్యదర్శిగా మాద సుభద్ర మరియు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవం ఎన్నుకున్నారు.

ఎన్నికైన వారి చేత ఎన్నికల అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు

ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు

ఈ కార్యక్రమంలో అఖిల భారత గాండ్ల సంఘం రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు