ఘనంగా దామచర్ల జన్మదిన వేడుకలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలు పొదిలి పట్టణంలో ఘనంగా జరిగాయి.
పట్టణంలోని రథం రోడ్డు లోని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన కేక్ ను కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు.
అనంతరం కార్మికులకు చీర జెకెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎండి గౌస్, సమంతపూడి నాగేశ్వరరావు, షేక్ జిలానీ, పొల్లా నరసింహ యాదవ్, మరియు టిడిపి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు