పొదిలి సిఐ యస్ఐలను సస్పెండ్ చేయాలని ఎస్పీకి పిర్యాదు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ప్రకాశం జిల్లా పొదిలి మండలం సల్లూరు గ్రామంలో మృతి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన యలగల వెంకటేశ్వర్లు మృతదేహానికి అంత్యక్రియలు అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్న అధిపత్య వర్గాల వారికి కొమ్ము కాయటమే కాకుండా బాధిత మహిళాల పట్ల తీవ్ర దురుసుగా ప్రవర్తించిన పొదిలి సిఐ వెంకటేశ్వర్లు యస్ఐ వేమన పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం నాడు ఒంగోలు లోని ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు పిర్యాదు చేశారు.

ఈ కార్యక్రమంలో చెన్నై కు చెందిన ద్రావిడ దేశం పార్టీ అధ్యక్షులు కృష్ణారావు, బిసివై పార్టీ నాయకులు మిరియం శ్రీనివాసులు న్యాయవాది శ్రీనివాస్ యాదవ్ మరియు యాదవ సంఘం నాయకులు, సల్లూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు