ఎద్దుల పోటీలు ప్రారంభించిన సిఐ శ్రీనివాసరావు

పొదిలి శివాలయం దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోలురాదా ఎద్దుల పోటీలను మంగళవారం నాడు పొదిలి సిఐ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇలాంటి పోటీలు ఏర్పాటు చేయటం వలన రైతుల్లో ఉత్సాహాన్నిస్తాయని పేర్కొన్నారు. ఒంగోలు జాతి ఎద్దుల అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. నిర్వకులు అనికెళ్ళా వీరారెడ్డి మాట్లాడుతూ మొదటి రోజు చిన్నసైజు, రెండువ రోజు పెద్దసైజు ఎడ్ల జతల పోటీల్లో విడివిడిగా ఎనిమిది నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వీరారెడ్డి తెలిపారు. అనంతరం మొదటి రోజు విజేతలు మొదటి భహుమతి మక్కెన కోటేశ్వరరావు 3600 అడుగులు 25వేల రూపాయలు నగదు రెండవ భహుమతి కళ్యాణ్ ఆక్వాఫామ్
3476 అడుగులు 15 వేల రూపాయల నగదు మూడవ నాలుగువ భహుమతులు గనుగపెంట హైమరెడ్డి 10 వేలు మరియు 5 వేల నగదు నిర్వహాకులు భహుకరించారు ఈ కార్యక్రమంలో పొదిలి యస్ ఐ నాగరాజు శివాలయం దేవస్థానం చైర్మన్ శామంతపుడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు