కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన : కందుల
పొదిలి వాసవీ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 206 నందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రం ను మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారయణరెడ్డి శనివారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులుకు గిట్టుబాటు ధరతో ప్రభుత్వంమే క్వింటా 5450 రూపాయలకు కొనుగోలు చేస్తుందిని మండలం లోని రైతులు అందరూ అవకాశంని ఉపాయైగించుకోలని అన్నారు మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనువాసులురెడ్డి మాట్లాడుతూ రైతులు కందుల ను 12 శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలిని
కందులను ఎండబేట్టలని అటువంటి వాటికి గిట్టుబాటు ధర లభిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాదలవారిపాలేం సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పొదిలి మండల తెలుగు దేశం నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు