క్రమశిక్షణ తో విద్యా ను అభ్యాసించాలి: జడ్పీటిసి సాయి
క్రమశిక్షణ తో విద్యార్థులు విద్యాను అభ్యాసించాలని పొదిలి జడ్పీటిసి సభ్యులు సాయి రాజేశ్వరరావు అన్నారు. ఉప్పలపాడు జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పిల్లల ఫేర్వెల్ పార్టీ మరియు పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.