చిన్న చెరువు కబ్జా పై నిరవధిక నిరహార దీక్ష
పొదిలి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 1114,1115,1172 చిన్న చెరువు నందు జరిగిన ఆక్రమణలను తొలగించాలి కోరుతూ శనివారం పొదిలి మండల రెవిన్యూ తహాశీల్ధార్ కార్యలయం వద్ద పొదిలి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముల్లా ఖాదర్ భాష నిరవధిక నిరహార దీక్ష ను ప్రారంబిచారు ఈ సందర్భంగా ముల్లా ఖాదర్ భాష మాట్లాడుతూ పొదిలి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 1115 లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ లను రద్దు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకలను అన్ లైన్ నందు 1బి అడంగల్లను రద్దు చేసి సదరు సర్వే నెంబర్లు 1114,1115,1172 నందు చెరువు లో అక్రమంగా వేసిన బోర్లును స్వాధీనం చేసుకొని పొదిలి గ్రామ పంచాయతీ ప్రజలకు మంచి నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలిని అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు పై చట్టపరమైన చర్యలు తీసుకోవలిని ఆయన అన్నారు . తొలుత పొదిలి మండల తహాశీల్ధార్ విద్యాసాగరుడు కు డిమాండ్స్ కూడిన వినతి పత్రం అందజేశి దీక్ష శిబిరం దగ్గరకు వచ్చిన తరువాత బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీపతి శ్రీనివాసరావు పూలమాల వేసి దీక్ష ను లాంఛనంగా ప్రారంభించారు