ప్రత్యేక హోదా కోసం రాజీనామలు కాని అవిశ్వాసం పెడదం అంటే ముందుకు రాడు : జగన్
– నాలుగు సంవత్సరాల బాబు పాలన ఇది.
– గతంలో రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి, గోధుమలు, కారం, ఉప్పు, పసుపు, చింతపండు, కిరోసిన్ అన్నీ ప్యాక్ చేసి రూ.185కే చేతుల్లో పెట్టేవారు. ఇప్పుడు బాబు ముఖ్యమంత్రి అయ్యాక రేషన్ షాపుల్లో బియ్యం తప్పు ఇంకేమీ దొరకటం లేదు. ఆ బియ్యం కూడా ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికి వేలిముద్రలు పడటం లేదని కటింగ్ చేస్తున్నారు.
– రైతన్నలకు ఏ పంటకైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయా?
– గిట్టుబాటు ధరల కోసం నేను ధర్నాలు చేయని సంవత్సరం లేదు.
– ఈ పెద్దమనిషి చేస్తున్న మోసాలు చూడండి. ఈ రుణాలు మీరు కట్టొద్దు అంటూ.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలన్నా, వ్యవసాయ రుణాలు పూర్తిగా బేషరుతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.
– బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? అంటే రాలేదు.
– బ్యాంకులు బంగారం వేలం వేస్తున్న నోటీసులు వస్తున్నాయ్.
– పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను బాబు మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్లు కన్నీరు కారుస్తున్నారు.
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగస్తులు, ఔట్ సోర్సింగ్ వాళ్లు ధర్నా చేస్తున్నారు.
– జాబు రావాలంటే బాబు పోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉందన్నారు.
-ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ టీడీపీ కార్యకర్తలు వెళ్లి బాబు సంతకం పెట్టారని ఏం చదవకపోయినా ఉద్యోగం ఇస్తారంటూ.. పాంప్లేట్ పంచారన్నారు. 45 నెలలు అయింది. నెలకు 2వేలు చొప్పన ప్రతి ఇంటికీ రూ.90వేలు బాబు బాకీ ఉన్నారు. – బాబు ఇసుక నుంచి మట్టిదాక.. మట్టి నుంచి బొగ్గుదాకా, బొగ్గు నుంచి మద్యందాకా, మద్యం నుంచి కరెంటు కొనుగోళ్లు వరకు ఏదీ వదిలిపెట్టడం లేదు. కరెంటు కొనుగోళ్లు నుంచి కాంట్రాక్టర్ల వరకు, కాంట్రాక్టర్ల నుంచి రాజధాని భూములు, గుడి భూములూ బాబు తినుడే తినుడు అంటూ విపరీతమైన అవినీతి చేస్తున్నారు.
– పైన బాబు అవినీతి చేస్తుంటే కింద జన్మభూమి కమిటీలు పింఛన్లు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే.
– ఒక ముఖ్యమంత్రి అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ.. ఎమ్మెల్యేలకు రూ.20-30 కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు.
– చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. తెలంగాణలో ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోవటం మనం అందరం చూశాం.
– ఒక ముఖ్యమంత్రి అవినీతి సొమ్ముతో అడ్డగోలుగా దొరికిపోయినా.. వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నాడో ఈయన పాలనే నిదర్శనం.
– అవినీతికి చక్రవర్తి అయినా అవినీతిపై మనకు క్లాస్ పీకుతాడు.
– అసెంబ్లీకి పోవాలంటే మనస్సు రావటం లేదన్నట్లు అసెంబ్లీ నడుపుతున్నారు.
– చట్టాలు చేసే చట్టసభల్లో వాటిని అవహేళన చేస్తున్నారు.
– కొన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేయరు. ఆ ఎమ్మెల్యేలను వారి పార్టీ గుర్తు మీద గెలిపించుకునే సత్తా లేదు. వాళ్లలో కొంత మందిని మంత్రి పదవులు ఇస్తారు.
– ఇలాంటి పాలన ఎక్కడైనా చూశారా?
– రేపు ఎన్నికలప్పుడు చిన్న చిన్న మోసాలు చెప్పడు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తాం అంటారు. నమ్ముతారా? నమ్మరని.. కేజీ బంగారానికి బోనస్ అంటారు. ప్రతి ఇంటికి బెంజ్ కారు అంటారు. – తన హామీలు నమ్మరని ప్రతి ఇంటికి మనిషిని పంపి చేతిలో మూడు వేలు ఇస్తారు. ఇస్తే వద్దు అనొద్దు. మూడు వేలు కాదు.. ఐదు వేలు గుంజండి. అది మన డబ్బే. మన జేబీలు కొట్టిన డబ్బే అదంతా.
– హామీలు ఇచ్చిన రాజకీయ నాయకుడు అది చేయకపోతే ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలి.
– జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాతం
– వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. వైయస్ఆర్ హయాంలో మొదటి సొరంగం 13 కి.మీ పూర్తి చేశారు. రెండో సొరంగం 9 కి.మీ పూర్తి చేశారు. నాలుగేళ్ల బాబు పాలనలో 4 కి.మీ సొరంగం తవ్వలేదు.
– ప్రకాశం జిల్లాలో చంద్రబాబు చేసిన మోసం ఇది.
– మన ప్రభుత్వం రాగానే వెలుగొండ ప్రజేక్ట్ పుర్తిచేస్తాము