లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించిన జంకె

పొదిలికొండ తిరుణాల సందర్భంగా పృథిలగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంను గురువారం నాడు మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకటరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు . జంకే వెంకటరెడ్డి వెంట జడ్పీటీసీలు సాయి రాజేశ్వరరావు బాషాపతిరెడ్డి ఎంపీపీ నర్సింహారావు దేవాదాయ శాఖ కార్యనిర్వహాన అధికారి దాసరి చంద్రశేఖర్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సంజీవ్ రెడ్డి, కందుల రాజశేఖర్, వెలుగోలు కాశీ తదితరులు పాల్గొన్నారు.