జనసేన పట్ల అప్రమత్తంగా ఉండాలి: శ్రీనివాస్ యాదవ్
జనసేన పార్టీ పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండలని నియైజకవర్గం పరిశీలకులు మరియు గుంటూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు స్ధానిక కాటూరి వారి పాలెం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పొదిలి మండల తెలుగు దేశం పార్టీ సమావేశం నిర్వహించారు .సందర్భంగా ముఖ్య అతిధి గా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీని అన్నతమ్ములు పవన్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్మకం చేసారని వారు ఇప్పుడు జనసేన రూపంలో మోదీకి ఏజెంట్ గా వ్యవరిస్తున్నరని ఆయన అన్నారు, కాబట్టి కార్యకర్తలు అందరూ అప్రమత్తం గా ఉండి వారు చేసిన పనులు ప్రజలు కు వివరించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పరిశీలకులు దుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ తెదేపా క్రమశిక్షణ గల పార్టీని కష్టపడే ప్రతి కార్యకర్తకు న్యాయ జరుగుతుందిని ఆయన అన్నారు నియైజకవర్గం ఇన్చార్జ్ కందుల నారయణ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేసి మండలం లో పార్టీకి పుర్వవైభవం తీసుకొని రావలని అదేవిధంగా త్వరలో పెద్ద చెరువు సమ్మర్ స్టోరేజ్ గా మార్చుటకు ప్రభుత్వం అనుమతులు తో పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఈ సమావేశం కు మండల పార్టీ కార్యదర్శి షేక్ రసూల్ అధ్యకతనతో జరిగింది
ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు కాటూరి పెద్ద బాబు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కఠారి రాజు మాజీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి మండల తెలుగు యువత అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ తెలుగు మహిళ అధ్యక్షరాలు సోమిశేట్టి శ్రీదేవి శివాలయం దేవస్థానం మాజీ చైర్మన్లు శామంతపూడి నాగేశ్వరరావు గొలమరి రమణరెడ్డి యస్సి సేల్ నాయకులు కానురి నాగేశ్వరరావు యర్రగుంట్ల నాగేశ్వరరావు ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా సమన్వయకమిటి సభ్యులు యస్ ఎం భాష మాజీ ఉపసర్పంచ్ ముల్లా ఖూద్దస్ తదితరులు పాల్గొన్నారు.