దళారులు నుండి కందులు కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతం : సహాయ సంచాలకులు మురళి కృష్ణ
పొదిలి మండలం పొదిలి మరియు కుంచేపల్లి నందు ఏర్పాటు చేసిన రెండు కందుల కొనుగోలు కేంద్రలను జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కె మురళి కృష్ణ సందర్శించారు కేంద్రల వద్ద ఉన్న రైతులను అడిగి కొనుగోలు తీరుతేన్నులు తెలుసుకొన్నరు ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ దళారులు వద్ద నుండి కందులు కొనుగోలు చేసినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు రైతుల ఎలాంటి అసౌకర్యం కలిగిన తమ దృష్టికి తీసుకొని రావలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎఓ దేవిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నిర్వకులు శ్రీనివాసులు రెడ్డి బాదం రవి తదితరులు పాల్గొన్నారు