పట్టపగలే ‌‌‍భారీ చోరీ 65 సవర్ల బంగారం లక్ష 50 వేలు నగదు అపహరణ.

పొదిలి పట్టణం విశ్వనాథపురం సిండికేట్ బ్యాంకు వెనుక నివసించే పొదిలి గ్రామ పంచాయతీ లో బిల్ల్ కలెక్టర్ గా పనిచేస్తున్న లక్ష్మి నారయణ గృహంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఈ చోరీ లో 65 సవర్ల బంగారం , ఒక లక్ష 50 వేలు నగదు అపహరించినట్లు గృహ యాజమని పోలీసులు లకు పిర్యాదు చేశారు. వివరాల లోకి వెళితే కాటూరి వారి పాలెం లో ఒక శుభకార్యంనకు కుటుంబ సభ్యులు అందరూ కలసి వెళ్ళారు మధ్యాహ్నం 2 గంటల సమయం లో ఇంటి యాజమని ఇంటికి తాళం వేసి వెళ్లి మరళా సాయంత్రం ఇంటికి వచ్చి బైయిట గేటు తీసి లోపల వెళ్లగానే తలుపు తాళం తీసివుంది లోపల బీరువా తెరిచి వుంది మొత్తం పరిశీలించి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులు కు సమాచారం అందించడంతో సంఘటన స్ధలానికి వెంటనే పోలీసులు చేరుకొని విచారణ ప్రారంభం చేసారు ఈ సంఘటన మాద్యహ్నం 3 గంటల నుండి 5 గంటల సమయం మద్య దొంగతనం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేసారు దరిశి సిఐ ఎం వెంకటేశ్వరరావు పొదిలి యస్ఐ నాగరాజు మరియు క్లూస్ టీమ్ సిబ్బంది తదితరులు పాల్గొని విచారణ చేపడుతున్నారు.