కందులు కొనుగోలు అక్రమలు పై రైతులు దీక్ష
కందులు కొనుగోలులో జరుగుతున్న అక్రమలపై విచారణ జరిపి న్యాయ చేయలని కోరుతూ పొదిలి మండల వ్యవసాయ శాఖ కార్యలయం వద్ద సోమవారం నాడు రైతులు దీక్షలు చెప్పాట్టారు. ఈ సందర్భంగా రైతు నాయకులు పేరం చెంచిరెడ్డి మాట్లాడుతూ మండలం లో ఉన్న రెండు కందుల కొనుగోలు కేంద్రలలో ముందు శాంపిల్ ఇచ్చిన వారికి కంటే వెనుక ఇచ్చిన వారివి మరియు దళారులు ద్వారా కొనుగోలు చేసిన వాటినే మాత్రమే కొనుగోలు చేస్తున్నారని అదేవిధంగా దళారులు నేరుగా రైతులు దగ్గరకు వచ్చి 4900 కొనుగోలు చేస్తామని మాకు అమ్మకపోతే కొనుగోలు కేంద్రంలో మీ యొక్క కందులు కొనుగోలు చేయరని అంటూ రైతులుకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని అయిన అన్నారు. వైసీపీ నాయకులు వాకా వెంకట రెడ్డి మాట్లాడుతూ రైతులు రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు దీక్షలు చేయవలసిన పరిస్థితి కి చంద్రబాబు తీసుకుని వచ్చారని తెదేపా నాయకులు ఆఖరికి కందులు కొనుగోలు లలో కూడా దళారురను రంగంలోకి దించి రైతుల కడుపు కడుతుందని అదేవిధంగా రైతులు చేసే ఉద్యమం కు వైసీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. సిపియం ప్రాంతీయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కందులు కొనుగోలు లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకొవలని కందులు కొనుగోలు గ్రామల వారిగా చేయలని రైతులు వద్ద ఉన్న కందులు మొత్తం కొనుగోలు చేయలని ప్రభుత్వంని డిమాండ్ చేసారు. ఈగలపాడు గొల్లపల్లి గ్రామలకు చెందిన రైతులు దీక్ష చెప్పట్టారు ఈ కార్యక్రమంలో కంభాలపాడు సర్పంచ్ పులగోర్ల శ్రీనివాస్ యాదవ్ రైతు నాయకులు పేరం చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు.