మంచి నీటి కోసం జాతీయ రహాదారి పై మహిళలు రాస్తారోకో
కొనకనమీట్ల మండలం చినరికట్ల జంక్షన్ జాతీయ రహాదారి పై మంచి నీటి కోసం మహిళలు రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ మా గ్రామం కు సాగర్ నీరు రాక సుమారు ఏడు సంవత్సరాల అవుతుందిని అదేవిధంగా నీటి ఎద్దటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మంచి నీరు సరఫరా చేయటం లో ప్రభుత్వం విఫలమైయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు రాస్తారోకో విషయం తెలుసుకొన్న పోలీసులు పొదిలి మర్రిపుడి దొనకొండ యస్ ఐ లు నాగరాజు శ్రీహరి సుబ్బారావు నాయకత్వం లో సంఘటన చేరుకొని ఆందోళనకారులుతో చర్చలు జరిపి రక్షిత నీటి సరఫరా అధికారులు పంచాయతీ కార్యదర్శి ని పిలిపించి వారి తో మాట్లడి ఆందోళన చేస్తున్న మహిళలుకు రేపటి నుండి ట్రాక్టర్లు ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడం తో మహిళలు రాస్తారోకో ను విరమించారు భారీ గా ట్రాఫిక్ జామ్ కావటం తో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధం చేసారు