బిసి యస్సి యస్టీ మైనారిటిలతో కలుపుకొని రాజకీయ శక్తిగా ఎదుగుతాం అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు బొట్లా రామరావు

ప్రకాశంజిల్లా అధ్యక్షులు బొట్లా రామరావు అన్నారు స్థానిక రోడ్లు భవనాల అతిధి గృహంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా గత 15 సంవత్సరాల నుండి యాదవుల నుండి చట్టసభలకు ప్రాతినిద్యం లేదని ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయింపు లో ద్రోహం చేస్తున్నాయని అదేవిధంగా 2014 తెలుగు దేశం పార్టీ జిల్లా లో ఒక్క టికెట్ కూడా కేటాయించాకుండా తీవ్ర అన్యాయం చేసిందిని ప్రచారం సందర్భంగా అధికారంలోకి రాగానే యాదవులకు శాసనమండలి లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు నెరవేర్చలేదని టిటిడి చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ కు ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు జిఓ విడుదల చేయలేదని వంశపారపర్యంగా వస్తున్న
సన్నిధి గొల్ల విషయంలో ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం నామినేటెడ్ పదవులలో బిసిల పట్ల వివక్షత చూపిస్తు పదవులు ఖాళీగా అయినా ఉంచుతున్నారుకాని పదవులు ఇవ్వడం లేదని కాబట్టి రాబోయే ఎన్నికల జిల్లా లో బిసి లకు ప్రతి రాజకీయ పక్షం 6 శాసన సభ సీట్లు కేటాయించాలని లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇతర బిసి యస్సీ యస్టీ మైనారిటీ ను కలుపుకొని ఎన్నికల లో పోటీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పోల్లా నరసింహ యాదవ్ మూరబోయిన బాబురావు యాదవ్ పి సురేష్ యాదవ్ పిన్నిక శ్రీనివాస్ యాదవ్ మెట్ల రాఘవ తదితరులు పాల్గొన్నారు